Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో కాసాని కిషోర్ అధ్యక్షతన జరిగిన డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.యువతకు విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ అమలు చేయకుండా యువతను మత తత్వ రాజకీయాలు వైపు మళ్లిస్తుందని విమర్శించారు.ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.అదేవిధంగా ఉద్యోగాలు నింపకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్పరం చేస్తూ నిరుద్యోగ యువతను ఉపాధి రంగాల నుండి దూరం చేస్తున్నారన్నారు.ఒకపక్క నిరుద్యోగం, మరోపక్క మతోన్మాదం యువతపై చేసేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి జె.నర్సింహారావు, జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన ఉపేందర్, మీసాల వీరబాబు, జెమి, ఎల్లయ్య, భావన, ఆదినారాయణ, తుమ్మ సతీష్, రామారావు, ఉత్తేజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.