Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధులు,ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మల్లు వెంకటనర్సింహారెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఈనెల 5 వ తేదీన హైటెక్ బస్టాండ్ పక్కన గల శ్రీ లక్ష్మీగార్డెన్స్‌లో 'మోడీ ప్రభుత్వ విధానాలు- వ్యవసాయరంగం' అనే అంశంపై జరిగే సెమినార్‌ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎంవీఎన్.భవన్లో కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన జిల్లా సెంటర్ బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని దివాళా తీసే విధానాలను అవలంబిస్తు న్నాడన్నారు.వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌శక్తుల చేతుల్లో పెట్టడం కోసం అనేక రకాల కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.దేశ వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.ఈ సెమినార్‌కు ముఖ్య వక్తగా ఆలిండియా కిసాన్‌సభ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకటరెడ్డి,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లాకార్యదర్శి మేకనబోయినసైదమ్మ, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరుగోవింద్, పట్నం జిల్లా కన్వీనర్ జే.నర్సింహారావు, సీఐటీయూ జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్,రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎలుగూరి జ్యోతి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.