Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-దామరచర్ల
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. దామరచర్లలో బుధవారం నిర్వహించిన సీఐటీయూ మండల మహాసభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు, హాస్టల్లో పని చేసే కాంట్రాక్టు వర్కర్స్ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులో ఉన్న అన్ని పెండింగ్ క్లైమ్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. 60 సంవత్సరాల నిండిన వారందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలని, సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూకి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల నూతన కన్వీనర్‌గా బైరం దయానందు, మండల కమిటీ సభ్యులుగా మధ్యాహ్న భోజన కార్మికుల నుండి కరీం మనిషా, కమలమ్మ, భవన నిర్మాణ కార్మికుల రంగం నుండి పల్లపు సైదులు, సీహెచ్.పిచ్చయ్య, వాడపల్లి గ్రామపంచాయతీ నుండి ఏ.సైదులు, విజరుకుమార్, వీర్లపాలెం హాస్టల్ వర్కర్స్ నుండి విజయ, ప్రైవేట్ టీచర్ సంఘం నుండి బీ.చంద్రశేఖర్, హమాలి వర్కర్స్ నుండి పెద్ద అరవింద్, దామరచర్ల ఆశా వర్కర్స్ నుండి మహేశ్వరితోపాటు పలురురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాపా నాయక్, సీఐటీయూ అధ్యక్షుడు సుబాని, తదితరులు పాల్గొన్నారు.