Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థూపాన్ని ఆవిష్కరించిన చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాలటౌన్
రైస్ మిల్లు డ్రైవర్ల హక్కుల కోసం అహర్నిశలు పనిచేసిన లింగయ్య మరణం సీపీఐ(ఎం)కు తీరని లోటని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మద్ది లింగయ్య స్మారక స్థూపంను నాయకులు చెరుపల్లి సీతారాములు, తుమ్మల వీరారెడ్డి గురువారం ఆవిష్కరించి లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం చెరుపల్లి మాట్లాడుతూ ఎర్ర జెండాకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ పని చేస్తే అక్కడ కూలి పెంచే పోరాటంలో కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతారని చెప్పారు. ఈనాటి రాజకీయాలు అవినీతిమయమయ్యాయని, డబ్బులు మందు పోస్తే పార్టీలు మారే నాయకులు కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ప్రలోభాలకు గురికాకుండా, పార్టీలు మారకుండా లింగయ్య లాంటి కార్యకర్తలు ఎర్రజెండా పార్టీలో ఎంతోమంది ఉన్నారన్నారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లింగయ్య లాంటి వాళ్లకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, మేక అశోకరెడ్డి, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్, జిట్ట సరోజ, జెల్లల పెంటయ్య, పామనుగుల్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, అరూరి శ్రీను, రాచకొండ శ్యామ్‌సుందర్, ఐతరాజు నర్సింహ, లడే రాములు, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, రుద్రారపు పెద్దులు, మేడి సుగుణమ్మ, బొడ్డుపల్లి వెంకటేష్, రైస్ మిల్లు యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు ఏల్ల మారయ్య, కడకంచి నర్సింహ, గోధుమగడ్డ మల్లారెడ్డి, కందుల అనిత తదితరులు పాల్గొన్నారు.