Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మంత్రులు, ప్రభుత్వ అధికారులతో కసరత్తు చేసిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- నల్లగొండ
మునుగోడు మండలం కేంద్రంలో గురువారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఐదుగురు మంత్రుల బృందంతో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షేమ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధితో పాటు మునుగోడు ఉప ఎన్నికలు ఇటీవల జరిగిన నేపథ్యంలో ఆయా గ్రామాలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు చేపట్టి అక్కడ ఉన్న మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్బి , పంచాయితీ రాజ్, గిరిజన, మున్సిపల్, చేనేత శాఖలపై కొనసాగనున్న రివ్యూ విభగాలపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రహదారులు, భవనాలు, గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జెడ్పీచైర్మెన్లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి అలుగుబెల్లి నర్సిరెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరు మర్తి లింగయ్య, డి.రవీంద్ర కుమార్, ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, శానంపుడి సైధి రెడ్డి, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్య నారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు టి.వినరు కష్ణా రెడ్డి, పమేలా సత్పతి,పాటిల్ హేమంత్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.