Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం
నవతెలంగాణ-సూర్యాపేట
ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం అన్నారు.ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన అవగాహన , అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సురక్షితం కాని లైంగిక పద్ధతులు, సురక్షితం కానీ సూదులు వాడడం, సురక్షితం కానీ రక్త మార్పిడి తదితర కారణాల వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని పేర్కొన్నారు.హెచ్.ఐ.వి వచ్చిన వారు తగు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు తెలుపుదాం బాధ్యత వహిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని కోరారు. కౌమార బాల బాలికలు ఎయిడ్స్ పై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ,ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏ.ఆర్.టి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ శ్రావణి, థామస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.