Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణప్రజలు తప్పని సరిగా తడి,పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ ట్రాక్టర్లకు,ఆటోలకు అందివ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్అన్నారు. ప్రత్యేక పారిశుధ్య నిర్వహణలో భాగంగా గురువారం పట్టణంలోని 1,7,10,19 వార్డ్ లలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 1 నుండి 15 వరకు మంత్రి జగదీశ్ రెడ్డి సూచనల మేరకు పారిశుధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 4వార్డ్ లలో వార్డ్ కు 10 మంది లేబర్ ను ఎంగేజ్ చేసి వార్డ్ లలో పేర్కొని పోయి చెత్తకుప్పలు, కాల్వలను శుభ్రపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. హానికర మైన సిరంజులు, న్యాప్కిన్ లు,బల్బులను సపరేట్ గా చేసి అందివ్వాలన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ను నిర్ములించుటలో భాగంగా ఇంటి నుండి బయటకు వెళ్లే టప్పుడు విధిగా క్లాత్ సంచి,మాంసాహారం లకు టిఫిన్ డబ్బ,పాలు పెరుగు కోసం బాటిల్స్ తీసుకొని వెళ్లాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోకౌన్సిలర్లు వేముల కొండ పద్మ, సానిటరీ ఇన్స్పెక్టర్ లు సారగండ్ల.శ్రీనివాస్,హెల్త్ అస్సిటెంట్ మస్కా పురం శ్రీనివాస్,వార్డ్ అధికారులు,జవాన్ లు తదితరులు పాల్గొన్నారు.