Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వేంల
ఈ నెల 3 సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న వికలాంగుల దినోత్సవం లో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని గత ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని జిల్లాలో వికలాంగుల భవనం నిర్మాణానికి కృషి చేయాలి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గురువారం మండలపరిధిలోని గుంపుల గ్రామంలో ఏర్పాటు చేసినఆసమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వికలాంగుల దినోత్సవానికి ఏనాడు మంత్రి హాజరు కాకుండా వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వికలాంగులకు కల్పించిన రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి, జిల్లా యువజన భాగం అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్, నాయకులు మహేష్, రాచమల్ల సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.