Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఈ నెల 5,6 తేదీల్లో ఆలేరులో డీవైఎఫ్ఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి కిరువైపులా గోడలపై వాల్ రైటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం యువతకు ఉపాధి లేక, ఉద్యోగం లేక, దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పాలక ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మతం ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ హిందుత్వం ఎజెండాను బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవలంబిస్తుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా యువతను సమీకరించి రెండు రోజులపాటు మేధావి వర్గంతో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరు బాలరాజు, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దూపటి వెంకటేష్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సారయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ఆలేరు పట్టణంలో ఈ నెల 5,6 తేదీల్లో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్ల ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు జమచేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మున్సిపల్, మండల అధ్యక్షులు దేప రాజు, సామిడి నాగరాజురెడ్డి, నాయకులు రత్నం శ్రీకాంత్, మెట్టు శ్రావణ్, సాయి, రొడ్డ శ్రీకాంత్, ఖాసీమ్, పురుషోత్తం పాల్గొన్నారు.
వలిగొండరూరల్ : మండల పరిధిలోని పులిగిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తెలుగు ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న ప్రహరీ గోడను నిర్మించాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కవిడే సురేష్, మండల కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శి వేముల జైపాల్, గ్రామ శాఖ అధ్యక్షులు వేముల వంశీ,కార్యదర్శి వడ్డేమాను మధు, నాయకులు వరికుప్పల నర్సింహా,వేముల రామకృష్ణ, లక్ష్మణ్,అఖిల్, శివ,రంజిత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : ఈ నెల 5,6తేదీల్లో ఆలేరులో నిర్వహిస్తున్న డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్ కోరారు.గురువారం మండలంలోని అనాజపురం గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, జిల్లా కోశాధికారి ఏదునూరి వెంకటేష్ నాయకులు మాజీ నాయకులు ఎదునూరి మల్లేష్ పాల్గొన్నారు.