Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె.నారాయణరెడ్డి, యాదాద్రి డీసీపీ
- దివిస్లో మేగా రక్తదాన శిబిరం
నవతెలంగాణ - చౌటుప్పల్రూరల్
సమాజ శ్రేయస్సులో భాగం రక్తదానమని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడానికి, ప్రాణాలు నిలపడానికి రక్తదానం దోహదపడుతుందన్నారు. గురువారం మండలంలోని అంకిరెడ్డిగూడెం, లింగోజీగూడెం గ్రామాల పరిధిలో ఉన్న దివిస్ పరిశ్రమలోమెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పరిశ్రమ జనరల్ మేనేజర్ సత్య చంద్ర దివి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తారు. అందులో భాగంగా గురువారం పరిశ్రమ ఆవరణలో దివిస్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ లు సంయుక్తంగా శిబిరం చేపట్టారు. ఈ సందర్బంగా డీిసీపీ మాట్లాడుతూ పరిశ్రమ ఎంప్లార్సు మానవతా దృక్పథంతో స్పందించడం అభినందనీయమన్నారు. పరిశ్రమ చేపట్టిన స్ఫూర్తితో రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో బయర్ కంపెనీ ఆడిటర్ ప్రశాంత్ పాటిల్, హనుమంతరావు,దివిస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సజ్జా రామకృష్ణ, చౌటుప్పల్ ఏసిపి ఉదరు రెడ్డి,రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ పి సుధాకర్,కిషోర్ కుమార్, శివప్రసాద్, చీఫ్ కోఆర్డినేటర్ ఎం.సావిత్రి, దివిస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.