Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కృష్ణయ్య 13వ వర్థంతిని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీిఐ సైదయ్య, ఎస్ఐ శేఖర్, మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధాహెమెందర్ గౌడ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వంగపల్లి అరుణ్ మండల నాయకులు ఇండ్ల వెంకటేష్ ,ఆకుల గిరిబాబు ,ఆకవరపు కృష్ణ ,లింగాల సుధాకర్ ,ఎల్ ఏన్ రావు , పల్లెపాటి శ్రీహరి ,ఊదరి నర్సింగ్ గౌడ్ ,నరసింహ వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలో తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్థంతి సభను పెద్దమ్మ ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కాటబోయిన రాజు గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సింలు, వార్డు సభ్యులు తోడేటి నరేందర్ ,గుర్రాల బాలరాజు ,ముదిరాజ్ సంఘం నాయకులు శంకర్ ,బాలకృష్ణ ,రామచంద్ర ,సిద్ధులు, ఝాన్సీ ,చాడ రాజు పాల్గొన్నారు.