Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ -చౌటుప్పల్రూరల్
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామంలో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.ఈ నెల26 న ఇంద్ర పార్క్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా కోడం వనజ, ఉపాధ్యక్షులుగా వనం లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శిగా బాతరాజు భీమయ్య, సహాయ కార్యదర్శిగా పోగు వెంకటేశం, కోశాధికారిగా ఉప్పు వీరయ్య లను ఏన్నుకున్నారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాగిర్ యాదయ్య,నాయకులు గడ్డం ధర్మయ్య,వనం హేమలత తదితరులు పాల్గొన్నారు.