Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిలాఫలకాలకే పరిమితమైతున్న అభివృద్ధి పనులు
- ఏండ్లతరుబడి కొనసాగుతున్న అభివృద్ధి పనులు
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులలో వివక్షత కనబడుతుందని నిధులు కూడా కేటాయించడం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక 18,6 వార్డుల లో కాంగ్రెస్ పార్టీ వార్డు వార్డుకు పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎన్నో ఆశలతో సంఘటితమై తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి సాధించుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిందన్నారు. రాష్ట్రంలో నీళ్లు ,నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన కలెక్టరేట్, పాత మెయిన్ రోడ్డు, సద్దుల చెరువు ,మినీ ట్యాంక్ బండ్ వంటి అనేక అభివద్ధి పనులలో పురోగతి లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టిన వార్డులలో దోమలకు ఫాగింగ్ చేస్తున్నారని మురికి కాలువలు చెత్తాచెదాలను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం అవసరమైతే ఎన్ని రోజులైనా పాదయాత్రకు సిద్ధమన్నారు. శివారు ప్రాంతాలైన ఆరో వార్డు, 18 వ వార్డులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 18 వ వార్డులో సుందరయ్య నగర్ లో దాదాపుగా 200 మంది పేదలు ఇండ్ల పట్టాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని,తక్షణమే సుందరయ్య నగర్ పేదలకు పట్టాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న,రమణ రెడ్డి,నామా ప్రవీణ్, పిల్లల రమేష్ నాయుడు,స్వామి నాయుడు, చొక్కయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.