Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నేరేడుచర్ల
నూతన జాతీయ విద్యా విధానంను రద్దు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్. సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో ఎస్టీఎఫ్ఐ దేశవ్యాప్త క్యాంపెయిన్లో భాగంగా ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాలైన సమాఖ్య స్ఫూర్తికి, లౌకిక విధానానికి తూట్లు పొడుస్తున్నదన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్రం ఏకపక్షంగా పెత్తనం చేస్తున్నదన్నారు. ప్రయివేటు సంస్థలకు ఈ దేశంలో విద్యారంగాన్ని అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ.అనిల్ కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కోశాధికారి వెంకటయ్య జిల్లా కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సాంబయ్య , గరిడేపల్లి మండలం ప్రధాన కార్యదర్శి: కోటేశ్వరరావు, జడ్పిహెచ్ఎస్ నేరేడుచర్ల పాఠశాల ఉపాధ్యాయులు నరస కుమారి , మాధవి , అన్నపూర్ణ , స్రవంతి, నరసింహారావు , రషీద్ ఖాన్ ,వెంకటేశ్వరరావు ,కృష్ణ ప్రసాద్ , రమేష్ ,నేరేడుచర్ల మండల శాఖ అధ్యక్షులు వై. కృష్ణయ్య ,శేఖర్ , అక్కయ్య బాబు పాల్గొన్నారు.