Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రాచకొండలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికీ ఆ భూములపై హక్కులు కల్పించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.చాలా కాలం నుండి సాగు చేసుకుంటున్నా రాచకొండ రైతులను కొందరిని ఆ భూముల నుండి ఇటీవల కబ్జా నుండి అధికారులు వెళ్ళగొట్టారని తెలిపారు.ఇప్పుడు సర్వే చేస్తున్న సమయంలో కబ్జాలో రైతులు లేరని చెప్పి సాగు చేసుకుంటున్న రైతులకు భూమి ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధన పేరుతో రాచకొండ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ఏర్పుల సుదర్శన్. ఎస్సీ సెల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ముత్యాల విజయ్ కుమార్. నాయకులు నెట్టు శ్రీకాంత్. మేకల వెంకటయ్య. వలిగొండ మాధవ్. బోయపల్లి శేఖర్ పాల్గొన్నారు.