Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుగ్గ నవీన్
నవతెలంగాణ- ఆలేరురూరల్
ఈ నెల5,6తేదీల్లో ఆలేరులో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ జిల్లారాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గ నవీన్ కోరారు. శుక్రవారం మండలంలోని శర్భనాపురం, పటేల్ గూడెం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి కాషాయికరణకు ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులిస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్య, వైద్యాన్ని ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ గడ్డమీది నరేష్, ఆ సంఘం మండల ఉపాధ్యక్షుడు సిరిగిరి సారయ్య, గ్యార రాజు, సూదగాని నరేందర్, శాఖ కార్యదర్శి ఏదు సాయి కుమార్, బండ శ్రీను, నాయకులు బుగ్గ ప్రవీణ్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : డీవైఎఫ్ఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని డీివైఎఫ్‌ఐ నాయకులు అధ్యక్షులు రామస్వామి, అనిల్ రెడ్డి, కార్యదర్శి దుబ్బాక జగన్ అన్నారు. శుక్రవారం రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పోచంపల్లి పట్టణ కేంద్రంలో కరపత్ర విడుదల ఏశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏట రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి లేదన్నారు. యువత మీద మతం మతోన్మాదం ముసుగులో దాడి ప్రారంభమైందన్నారు. ఈ నెల 5, 6 తేదీలలో ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి శ్రీకాంత్ యాదగిరి. రాములు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం యువత ముందుండి పోరాడాలని డీివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పిలుపునిచ్చారు.డిసెంబర్ 5, 6లలో ఆలేరు పట్టణ కేంద్రంలో జరిగే డివైఎఫ్ఐ జిల్లా శిక్షణాతరగతులను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని జనంపల్లి, ఇస్కిల్ల, కక్కిరేణి, పల్లివాడ, తుమ్మబాయిగూడెం, మునిపంపుల, దుబ్బాక గ్రామాలలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని అంతర్గత రోడ్లు లేక, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిం చారు. ఈ కార్యక్రమంలో వేముల సైదులు, దామోదర్, అప్పం సురేందర్, గంటేపాక శివ, మేకల జెలెందర్, మేడి మధుబాబు, కంబాలపల్లి మత్స్యగిరి, సుందర్ పాల్గొన్నారు.