Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తిరుమలగిరి వచ్చిన కేంద్ర బొగ్గుగనుల, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాధ్ జోషిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టె విధంగా చర్యలు తీసుకోవాలని కోరగా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ఇంఛార్జి అనంతుల దేవంజీ , నాయకులు సిహెచ్.హన్మంత్ , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.