Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
నూతన విద్యా విధానంతో బడుగు,బలహీన వర్గాలకు విద్య దూరమవుతుందని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ అన్నారు. ఈ నెల 13నుండి 16వరకు ఉస్మానియాలో జరిగే ఆ సంఘం జాతీయ మహాసభ పోస్టర్ను శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. మహాసభలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు సెంట్రల్ యూనివర్సిటీల నుండి 1500 మంది విద్యార్థి ప్రతినిధులు, పలు దేశాల నుండి విద్యార్థి నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు కందుల నాగరాజ్, ఉపాధ్యక్షులు కంతి విక్రం, విద్యార్థి నాయకులు ఆదే సుజిత్, పశికంటి ఉదరు కుమార్, కళాశాల విద్యార్థులు తుమ్మల వంశీ, బొడ్డు తరుణ్, రామకృష్ణ,రాజేందర్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.