Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పెరిగిన ధరలకనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో ఆ సంఘం ఆలేరు మండల, పట్టణ మహాసభ మండల కార్యదర్శి మొరిగాడి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరగడంతో, కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. కార్మికులు పొందే వేతనాలు సరిపోక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కొద్ది మంది కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయన్నారు. సంపద సృష్టిస్తున్న కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళకోరు ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పాలకవర్గాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో పోరాటాలను ఉధృతంగా చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ మొరిగాడి రమేశ్, మండల కన్వీనర్ సంగి రాజు, నాయకులు ఎగ్గిడి సిద్దులు, అనురాధ, పుష్పలత, కృష్ణ, వెంకటేశ్, గ్యార అంజయ్య, యాదగిరి, రాంచందర్, సుగుణమ్మ, కందుల ఉప్పలమ్మ, రేణుక, ఉమ, భాగ్యలక్ష్మి, యాకూబ్, నర్సమ్మ, మల్లమ్మ, మమత పాల్గొన్నారు.