Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
గుర్తించబడిన అక్రమ, అనధికార నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో జరిగిన జిల్లా స్థాయి ఎన్ఫోర్స్మెంట్ సమీక్షా సమావేశములో ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రోజులుగా జిల్లాలోని అన్ని పట్టణాలలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి భవన నిర్మాణాలను పరిశీలించినట్టు తెలిపారు. చట్ట విరుద్దంగా చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగిందని, వీటన్నింటిపై ప్రభుత్వ విధి విధానాల ప్రకారం నోటీసులు జారీ చేయాలని, ఆ తదుపరి నిర్ణీత కాల వ్యవదిలో చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.