Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.లక్ష విలువ గల బంగారం స్వాధీనం
- ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
- డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
గత నెల 30న ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారంజిల్లాకేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఐటీపాముల రామాంజనేయులు తాగుడుకు బానియ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న సందర్భంలో అప్పు తీర్చడం కోసం తన బాల్య స్నేహితుడైన భీమనపల్లి బాలకష్ణ తల్లిని చంపి ఆమె ఒంటిపై గల బంగారు ఆభరణాలను దోచుకొని తన అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం భీమనపల్లి బాలకష్ణ అమ్మ అనంతమ్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెకు మద్యం తాపించాడు. బ్లేడుతో ఆమె గొంతు కోసి, అతి కిరాతకంగా చంపాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు చైను, చెవి పోగులు, ముక్కుపుడకలను దోచుకొని అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న నగలను అదే గ్రామానికి చెందిన జల్ల బిక్షపతి వద్దకు తీసుకువెళ్లి తన భార్య నగలు అని చెప్పి నమ్మించి, కుదువ పెట్టి డబ్బులు కావాలని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో బలవంతంగా అతని జేబులో చైను పెట్టి రెండు, మూడు రోజులైనా పర్వాలేదు డబ్బులు ఇప్పించు అని చెప్పి వెళ్లాడు.మృతురాలి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రామాంజనేయులు మీద అనుమానం కలగడంతో ఈ నెల 1న అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్యచేసినట్టు విచారణలో తేలింది. అతని వద్దనున్న బంగారు చైన్ (నాలుగు తులలు), చెవి కమ్మలు, ముక్కుపుడక అర తులం, ఒక సాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
80 వేల నగదు,నాలుగు కార్లు, మూడు మోటార్ సైకిల్ స్వాధీనం
మోత్కూర్ పరిధిలో గొర్రెల దొంగతనాలు చేస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.80వేల నగదు, నాలుగు కార్లు, మూడు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో విలేకర్లకు వివరాలు వెల్లడించారు.గత నెల15 దొండ సోమయ్యకు చెందిన మూడు మేకలు, మూడు మేకపోతులు ఎత్తుకెళ్లారని ఇచ్చిన ఫిర్యాదు చేశాడు. గత నెల 29న మండ్ర సత్తయ్య కు చెందిన గొర్రెల దొడ్డిలో రెండు మేకపోతులు ఎత్తుకెళ్లారని వచ్చిన ఫిర్యాదు మేరకు మోత్కూరు పోలీసులు సీసీఎస్ భువనగిరి జోన్ వారితో కలిసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పాటీమట్ల ఎక్స్‌రోడ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పదంగా ముసిపట్లకు చెందిన ఋషి పాక పురుషోత్తం, శాఖాపురం నవీన్ బైకుపై అనుమానాస్పదంగా తరుగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మోత్కూరు పరిధిలో గొర్రెల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 80 వేల నగదు, నాలుగు కార్లు , మూడు మోటార్ సైకిలను స్వాధీనం చేసుకున్నారు. తెలిపారు. వారిపై భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు, బొమ్మలరామారం పరిధిలో ఒక కేసు, ఆత్మకూర్ పరిధిలో రెండు, రామన్నపేట పరిధిలో మూడు, బీబీనగర్ పరిధిలో ఒకటి, మోత్కూరు పరిధిలో రెండు, గుండాల పరిధిలో రెండు, నార్కట్‌పల్లి పరిధిలో ఒక కేసు మొత్తం 14 కేసులు నమోదైనట్టు తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. రెండు కేసులను చేధించిన చౌటుప్పల్ ఏసీపీ ఉదరు రెడ్డి, సీసీఎస్ భువనగిరి ఇన్స్పెక్టర్ సైదయ్య, దేవేందర్ , రవీందర్, రామన్నపేట సీఐ మోతిరామ్ ,మోత్కూర్ ఎస్సై జానకి రెడ్డిలను అభినందించారు.