Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరికివేతలో ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
మొక్కలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలుపథకాలను ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెట్లను నాటుతుండగా ఆత్మకూరు మండలంలోని ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా 15 నుండి 20 ఏండ్లు ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ, మండల పరిషత్ కార్యాలయంలో 20 ఏండ్లుగా పెంచిన భారీ చెట్లను ఏదో ఒక సాకు చెప్పి నరికి వేస్తున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లను నరకాల్సి వస్తే తీర్మానం చేసి టెండర్లు పిలిచి నరకాల్సి ఉంది. టెండర్ల ద్వారా చెట్లను నరికిన డబ్బులతో ఆ కార్యాలయంలోని పలు అభివృద్ధిపనులకు సద్వినియోగం చేయాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు, అధికారులు చెట్లను నరికే డబ్బులను పంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించేందుకు త్వరలో సెంట్రల్బృందం వస్తుందని సాకుతో 15 నుండి 20 ఏండ్ల పాటు పెంచిన భారీచెట్లను శుక్రవారం నరికేశారు.నవిలే నార, వేపచెట్లను సైతం నరికివేశారు.మండల పరిషత్ కార్యాలయంలో పలుమార్లు భారీగా పెరిగిన చెట్లను నరికి మాజీ ప్రజా ప్రతినిధి బొగ్గుబట్టీలకు ఉపయోగించుకుంటున్నారు. పరిసర ప్రాంతాల్లో బొగ్గుబట్టీలకు సరైన చెట్లు దొరకడం కూడా బొగ్గుబట్టి వ్యాపారులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన భారీ చెట్ల ఫై కన్నుబడి అధికారులను ప్రజాప్రతినిధులను చెట్లను నరికివేసి బొగ్గు బట్టలకు ఉపయోగిస్తున్నారు.నరికినచెట్లకు వచ్చిన ఆదాయం ఏమవుతుందో ఎక్కడ ఉందో ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియకపోవడం విశేషం.
ఆరోగ్య కమిటీ తీర్మానం మేరకే నరికివేయిస్తున్నాం
ఇన్చార్జి వైద్యాధికారి వీరేంద్రనాద్
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గోడలకు అడ్డంగా ఉన్న చెట్లతో పాటు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్న చెట్లను ఆరోగ్య కమిటీ తీర్మానం మేరకు నరికివేశారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించేందుకు త్వరలో సెంట్రల్ అధికార బృందం వస్తున్నందున ప్రహరీ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అడ్డుగా ఉన్న చెట్లను నరికివేశాం.
కొమ్మలు విరగడంతో చెట్లను నరికివేస్తున్నాం
ఎంపీడీఓ-మల్సూర్నాయక్
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్లు అప్పుడప్పుడు కొమ్మలు విరిగిపడడం కారణంగా చెట్లను నరికి వేస్తున్నాం.ఇందుకు తీర్మానాలు అలాంటివి ఏమీ లేవు.