Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట డీఈఓ అశోక్
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 5,6,7వ తేదీలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్పేర్ను విజయవంతం చేయాలని డీఈఓ కె.అశోక్ అన్నారు.శుక్రవారం స్థానిక ఆనంద విద్యామందిర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమం జరిగే ఆనంద విద్యామందిర్ ప్రాంగణం పేరును సైన్స్ ఉపాధ్యాయులు 'బింగి రాజేందర్ ప్రాంగణం'గా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు.ఈ ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం చైర్మెన్‌గా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,కన్వీనర్‌గా జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్, కో కన్వీనర్లుగా జిల్లా సైన్స్ అధికారి దేవరాజు, విద్యా శాఖ కార్యాలయం సెక్టోరియల్ అధికారులు,మండల విద్యాదికారులు, సభ్యులు గా జిల్లాలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులతో అడ్వైజరీ కమిటీతోపాటు మొత్తం 21 కమిటీలకు కన్వీనర్ లను కో కన్వీనర్ లను సభ్యులను ఎంపిక చేశామని వివరించారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రయివేట్ పాఠశాల విద్యార్థులుహాజరయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా,సుహృద్బావంతో,క్రమశిక్షణతో నిర్వహించేందుకు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులతో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్రీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ,పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్,గణితం పర్యావరణ ప్రదర్శన 2021-2022 సంవత్సరంలో సెలెక్ట్ కాబడిన 54 ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టులను ఈ సైన్స్‌ఫేర్‌లో ప్రదర్శిస్తారని తెలిపారు.