Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ఇటీవల మండలపరిధిలోని మిర్యాలలో పీఏసీఎస్ చైర్మెన్ కనకట వెంకన్న ఆధ్వర్యంలో గత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఓటమికి గురైన టీఆర్ఎస్ అభ్యర్థితో సహా ఆ ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ లోనే చేరారు.ఇక ప్రతిపక్షం పూర్తిగా కరువైనట్లేని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.వెంకేపల్ల్లి గ్రామంలో టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి బత్తుల సాయిలుగౌడ్ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో ఓటమికి గురైన సర్పంచ్ ప్రత్యర్థితో పాటు ఆ పార్టీకి చెందిన మండల నాయకులు సైతం ఒకేసారిగా 50 మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు.ఈ చేరికతో గ్రామంలో టీఆర్ఎస్ ఏకపక్షంగా మారిందని బావిస్తున్నారు. తాళ్ళసింగారంలో సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు చూడి లింగారెడ్డి,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పన్నాల సైది రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపక్ష జాతీయ పార్టీలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షుడు, యూత్ విభాగం అధ్యక్షుడితో సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీిఆర్ఎస్లో చేరారు.అసలు ఓటర్లు లేని గ్రామంలో ఏకపక్షంగా టిఆర్ఎస్ అభివృద్ధి చెందింది.. ఎడవెల్లిలో సర్పంచ్ కొచ్చర్లబాబు,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల తిరుమలరావు స్వగ్రామామైన ఎడవెల్లికి చేరుకొని శాసనసభసభ్యులు ఆదేశాలను సారం పార్టీ బలోపేతం కోసం కృషిచేసి ప్రతిపక్షం లేకుండా వివిధ పార్టీల నాయకులను కార్యకర్తలను భారీసంఖ్యలో టీఆర్ఎస్లో చేర్పించారు.నూతనకల్ మండలకేంద్రం పెద్ద గ్రామమైన కాంగ్రెస్ కంచుకోటగా ఉండి గత సర్పంచి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 800లకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఈ గ్రామంలో ప్రస్తుత ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి,ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందిన నాటి నుండి వివిధ పార్టీల నాయకులను కార్యకర్తలను టీఆర్ఎస్లో చేర్పించి పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేస్తున్నారు.
టీఆర్ఎస్కు ప్రతిపక్షాలు లేనట్టే?
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామం తప్ప వివిధ గ్రామాలలోని ఇతర పార్టీల ముఖ్య నాయకులను టీఆర్ఎస్లో చేర్పించుకొని ప్రతిపక్షాలు లేకుండా చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఎదురులేకుండా ఏకపక్షంగా విజయం సాధించవచ్చని ప్రజలు భావిస్తున్నారు.