Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
విద్యుత్‌రంగాన్ని ప్రయివేటీకరణ చేస్తున్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోటగిరి వెంకటనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ఆ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రయివేటీకరణ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ బిల్ కలెక్టర్‌కు కనీసవేతనం అమలుచేయాలని ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడంలేదన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తూ లక్షలాదిమంది విద్యుత్ ఉద్యోగులను తొలగిస్తూ వారికి అన్యాయం చేస్తుందన్నారు.ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు చిత్తలూరి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కొలిశెట్టియాదగిరిరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు, కే.భాస్కర్, బ్రహ్మం, వీరబాబు, సైదిరెడ్డి, యూసఫ్, శ్రీరాములు, జానీపాషా, మీరా, గోపయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.