Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖబరాస్తాన్,కమ్యూనిటీహాల్ నిర్మాణపనుల పరిశీలన
- మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ నాయకులు
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన స్థలాలను పరిశీలించారు.ఇటీవలే హైదరాబాద్‌లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, మైనార్టీ పెద్దలు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసిన సందర్భంగా వివిధ అభివృద్ధిపనులపై చర్చించారు.ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు కమిషనర్ పట్టణంలోని చిన్నమజీద్ వద్ద నిర్మించనున్న కమ్యూనిటీ హల్,అంబేద్కర్ నగర్ వద్ద 71వ సర్వే నెంబర్లో గల ఖబరస్తాన్ ప్రహరీనిర్మాణం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రహరీ నిర్మాణాలతో పాటు వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టుతామని పేర్కొన్నారు.మంత్రి వెంటనే స్పందించి అభివృద్ధి పనుల నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వడం హర్షణీయమని ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు అజీజ్,పట్టణ ఉపా ధ్యక్షులు చాంద్‌పాషా,జిల్లా నాయకులు తాహెర్, రఫీ, అక్రమ్, ఉస్మాన్,అబ్దుల్లా, బాసిత్, ఖాదర్, జానీ,జలీల్, తదితరులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.