Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలంలోని అనాజిపురం గ్రామంలోని గాండ్లచెరువులో జాలర్లకు వింతచేప చిక్కింది.దీంతో ఆ చేపను చూడడానికి గ్రామస్తులు ఎగబడ్డారు.అనాజిపురం పెద్దచెరువులో శుక్రవారం మత్స్యకారులు చేపలు పట్టడానికి ఉదయం వలలు వేశారు.మధ్యాహ్న సమయంలో చేపలను తీస్తుండగా ఒక్కసారిగా మత్స్యకారులు ఎప్పుడు చూడని ఒక చేప వలకు చిక్కింది. చేప మొత్తం నలుపు రంగులో ఉండటం పెద్ద పెద్ద మచ్చలు, చేప మూతి కొంచెం భయంకరంగా ఉండడంతో ఆ చేపను మత్స్యకారులు దయ్యం చేపగా అభి వర్ణించారు. కొన్నేండ్లుగా తమ చెరువులో చేపలు పడుతున్నామని ఏ రోజు కూడా ఇటువంటి చేప తమ వలలకు చిక్కలేదని పేర్కొన్నారు.ఇటీవల చెరువు అలుగుపోయడంతో ఇతరప్రాంతాలకు చెందిన చేపలు తమ చెరువులకు వచ్చినట్లు మత్స్యకారులు పేర్కొంటున్నారు.కాగా వింతచేపను జాలర్లు తిరిగి అదేచెరువులో వదిలిపెట్టారు.