Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
బడుగు, బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయమని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.అదేవిధంగా బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో
అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకొని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా నాయకులు వంటిపాక కృష్ణ, నాయకులు గండమల్ల బాలస్వామి, ఆది మల్ల ప్రవీణ్, ఏర్పుల నరేష్, జిల్లా గిరి, అంతయ్య, అంజయ్య పాల్గొన్నారు.
నల్లగొండ :భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేవీపీఎస్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సభ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో కేవీపీఎస్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొట్టు శివకుమార్, రైతు సంఘం జాతీయ కమిటీ సభ్యులు బండ శ్రీశైలం సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్,ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, నాయకులు కోట సైదులు పెరిక కృష్ణ రాములు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండరూరల్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్థంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ కత్తి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఆ సంఘం జాతీయ చైర్మన్ భారతరత్న అవార్డు గ్రహీత బొమ్మరబోయిన కేశవులు, రాష్ట్ర కన్వీనర్ బండమీద అంజయ్య అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నిర్ణయించడం, ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రతిష్టించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం కన్వీనర్ సదాలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ దుబ్బ కొండమ్మ, పట్టణ కార్యదర్శి అందిమల్ల మౌనిక, గడ్డం శంకరయ్య, ప్రభాకర్ రెడ్డి, శంకర్ దుర్గ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో ...
అంబేద్కర్ వర్థంతి సందర్భంగా స్థానిక ఎన్జీ కళాశాలలో అంబేద్కర్ విగ్రహానికి ప్రిన్సిపాల్ గణ శ్యామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌండిన్య, సుబ్బారావు, నాగరాజు, చంద్రశేఖర్, యాదగిరి, నారాయణ రావు, సీతారాం రాథోడ్, వేణు యాదవ్, బాలస్వామి, శ్రీనాథ్ పటేల్, నాగిరెడ్డి, ముత్తయ్య, శివరాణి, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.
చిట్యాల టౌన్: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా బి.ఆర్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్పూర్తి దాయకమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షత అంటరాని తనం పై అంబేద్కర్ రాజీలేని పోరాటాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఈసం రాజు, యల్లంల వీరయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు గుండాల సత్తయ్య, జిట్ట రమేష్, నర్సింహ,కుమార్, సుందర్, తీగల క్రిష్ణయ్య, నడిగోటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి గ్రామంలో మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధన కొరకు కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు కందుల అనిత, శీలా రాణమ్మ, లెంకల రేణుక, క్రిష్ణ వేణి, మేడి సుమలత, అశ్విని, సిరిఫంగి శిరీష, రమణ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి గ్రామంలో స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామ ఉపసర్పంచ్ సాగర్ల నరేష్ యాదవ్ పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాలవేసి ఆయన ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పునూతల నరసింహ, సిరిపంగి గోపాల్, నర్రా రాములమ్మ, మునుగోటి భాగ్యలక్ష్మి, పల్లపు భీమయ్య, దూదిగామ సత్తయ్య పాల్గొన్నారు.
మండలంలోని శివనేనిగూడెంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్ ఎస్ ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోఆప్షన్ మెంబర్ రుద్రవరం పద్మ యాదయ్య , సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ స్వామి కౌన్సిలర్ బెల్లి సత్తయ్యయాదవ్ , శేఖర్ మౌనిక, ఎరసాని గోపాల్ , బీజేపీ కిసాన్ మోక్ష చికిలంమెట్ల అశోక్ , మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ, కన్నబోయిన మహాలింగం, టిఆర్ఎస్ నాయకులు దాసరి నరసింహ, ఎమ్మార్పీఎస్ నాయకులు చేకూరి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిి ఒక్కరు సిపిఎం జిల్ల్షా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు అన్నారు. మేండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు ,కేతపల్లి మాజీ సర్పంచ్ ఏళ్ల అశోక్ రెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్డు మారయ్య వీరబోయిన సౌడయ్యా మట్టి సలోమన్ దండం జోజి ఆరోగ్య ఆనంద్ పాల్గొన్నారు.
చండూర్ : గట్టుప్పల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరేట్పల్లిలో మంగళవారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 64వ వర్థంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ , మండల కార్యదర్శి మురసు మల్లేశం గార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు సాయిరాం,నర్సింహ,బూరుగు వెంకటేశ్వర్లు , సాయిరాం,నర్సింహ,బూరుగు. వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.
చండూర్ లో....
భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఇందులో వడ్డేపల్లి భాస్కర్ సాగర్, బుర్కల దశరథ, సోము లింగస్వామి. రాపోలు వెంకటేశం, చొప్పరి రాజు, ఎర్రజెల్ల నాగేంద్ర, సంతు, ఇడికుడ నరేందర్, కర్నాటి యాదయ్య, కర్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.