Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఆదివాసి గిరిజనులకు తొలి ఆత్మబంధువు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఖమ్మం ఎక్స్‌రోడ్, రైతుబజార్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం అనే పవిత్రగ్రంథాన్ని దేశంలోని అన్ని కులాలకు, అణగారిన జాతుల వారికి ప్రసాదించిన గొప్ప సామాజిక పరివర్తకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ జీడిభిక్షం, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్లహస్సేన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోడ శ్రీరాములు, గ్యార కనకయ్య, ఎర్ర వీరస్వామి, నాయకులు జ్యోతి కర్నాకర్, బొల్లెద్దు దశరథ, నెమ్మాది కృష్ణ,మద్దూరి కుమార్, బొల్లెద్దు వినరు, రవి,కట్లమురళి, కర్రి నాగయ్య, మహిళా నాయకురాలు మహేశ్వరి, వెంకటమ్మ పాల్గొన్నారు.
అదేవిధంగా పట్టణంలోని ఖమ్మంక్రాస్రోడ్డులో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్‌టీఎస్ జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్మాదిగ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర నాయకులు పల్లెటిలక్ష్మణ్ మాదిగ, కనుక జానయ్యమాదిగ,జిల్లా కోశాధికారి బొజ్జ పరుశరామ్, ఠాగూర్, సాయి, మహేష్, భరత్, సృజన్, శ్రావణ్,బన్నీ, గణేష్ పాల్గొన్నారు.
పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్యయాదవ్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ కిరణ్, పట్టణ అధ్యక్షులు బంధన్నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినరుగౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు బీసుస్వామిగౌడ్,మైనార్టీ సెల్ నాయకులు ఖలీల్,యువజన నాయకులు దొన్ వాన్ కృష్ణ, హరీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : అంటరానితనం నిర్మూలన కోసం,బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మండలపరిధిలోని సంగెం గ్రామ సర్పంచ్ ఏశమల్ల సుశీల సామేల్ అన్నారు.మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 66వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్టీసీడిపో అసిస్టెంట్‌మేనేజర్ వెంకటమ్మ, ఎంపీటీసీ కలకోట్లఎలేజర్,బొడ్డు శ్రీను,కాకులారపు మధుసూదన్‌రెడ్డి,జటంగి రవి, లింగయ్య, మహేష్, మహేందర్, వెంకటరత్నం, జీవయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఆరాధ్య ఫౌండేషన్ అనునది మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులు ఫత్తేపురం విజయ్ అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆరేండ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న నల్లనాగుల దేవేంద్రాచారి కుటుంబానికి 50 కేజీల బియ్యం, కుటుంబ సభ్యులందరికీ పోస్టల్ ప్రమాదబీమా అందజేశారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల సభ్యులు పోతరాజు సురేష్, కొండా వెంకన్న, వీరబోయిన శ్రీను, అంబటి రాములు, ఉల్లెందుల వెంకన్న, కటకం సతీష్ ,గోపగాని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి నిర్వహించారు.ఆ పార్టీ జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్‌రావు, కొదమగండ్ల నగేశ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుంకు తిరుపతయ్య, అనేగంటి మీనయ్య, నీలారామ్మూర్తి, జొన్నల గడ్ల వెంకన్న, పాతూరి శ్రీనివాసరావు, గుర్రం యేసు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, సట్టు.కోటయ్య, సట్టు.వెంకన్న, బోల్లెపల్లి శ్రీను, తాడోజు శ్రీను పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని పెంచికల్‌దిన్న గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ(ఎం) మండలకార్యదర్శి సిరికొండ శ్రీను పూలమాలలలేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి అల్వాల శ్రీధర్,ఎడవల్లి చంద్రయ్య, ఊట్కూరు సైదులు, జీడిమెట్ల రవి, నాయకులు పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలకేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్యా పాండునాయక్,మండల కార్యదర్శి మాలోత్ బాలునాయక్, సీఐటీయూ మండలకన్వీనర్ సయ్యద్ రన్‌మియా, పి.రాము తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : కాంగ్రెస్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి నిర్వహించారు.ట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్కళాశాల ప్రిన్సిపాల్ రంగారావు ,రేవంతన్న సైన్యం నాయకులు , జలంధర్, భారీ వెంకన్న, వీరబాబు, చంటి ,తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు: మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీడీఓ ఈదయ్య పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడారు వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ అలసకాని జనార్దన్, ఎంపీటీసీ బెల్లంకొండ రమణ, నాగయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్, చేపూరి కొండలు, ఎడవెల్లి పుల్లారావు, ఎస్కె.సోందుమియా, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: మండలపరిధిలోని అమీనాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ బీఎస్పీ కన్వీనర్ వెంపటి నాగమణి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అంకతి శ్రీను ,అంబేద్కర్ ఫాలోవర్స్ ,తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు జీవించడానికి సమాన హక్కులు కల్పించిందని డీఎస్పీ నాగభూషణం,రూరల్ సీఐ సోమనారాయణ సింగ్ అన్నారు.మండలపరిధిలోని కాసరబాధ గ్రామంలోని డా.అంబేద్కర్ విగ్రహానికి ఆయన సీఐ, జెడ్పీటీసీ జీడిభిక్షంతో కలిసి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామస్వామి శ్రీనివాస నాయుడు,మాజీ మార్కెట్ డైరెక్టర్, చైర్మెన్ ఎస్.రమణారెడ్డి, సర్పంచ్ కొల్లు రేణుక నరేష్, ఎంపీటీసీ బంటు నాగమ్మ సైదులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని కాసరాబాద గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ మండలఅధ్యక్షులు కోతి గోపాల్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగాని సైదులు, నాయకులు షేక్ లతీఫ్, చింత భాస్కర్,దొడ్డిగాల రాజు, కొల్లు నాగయ్య, కొల్లు సైదులు పాల్గొన్నారు.
మునగాల : మండలకేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 66 వర్థంతి నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండలనాయకులు కిన్నెర వెంకన్న, అంజయ్య, హుస్సేన్, మైసయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట : సమసమాజ నిర్మాణ స్దాపన జరగాలన్న అంబెడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని టీయూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు దామెర శ్రీనివాస్ అన్నారు.అంబేడ్కర్ 66వ వర్దతి సందర్భంగా ఆ సంఘం స్థానిక ఆనంద విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కమిటీ కన్వీనర్ ధరణికోట రవికుమార్,రాష్ట్ర ప్రచురణల కమిటీ కన్వీనర్ యర్రంశెట్టి చలమందరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కస్తూరి కిషన్ ప్రసాద్,మామిడి అరవింద్, గౌరవ అధ్యక్షులు గన్న శ్రీనివాస్,కార్యదర్శులు మహ్మద్ షఫి,అక్కినపల్లి శ్రీనివాసరావు, అడిట్ కమిటీ కన్వీనర్ తాటిపాముల శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా కమిటీసభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, నాయకులు వేల్పుల వెంకన్న, జిల్లాపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, చిన్నపంగ నర్సయ్య పాల్గొన్నారు.
పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్.అంబేద్కర్ చిత్రపటానికి కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, జిల్లా కార్యదర్శి పిడమర్తి మల్లయ్య, ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు రెబల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మోతె: మండలంలోని రాఘవపురంఎక్స్రోడ్డు గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి సామాజికవర్గ యూత్ అధ్యక్షులు కిన్నెర పోతయ్య పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు కొమ్ము క్రాంతికుమార్, కొమ్ము నరేష్, నిమ్మల శ్రీనివాస్ రెడ్డి, కారింగుల లింగయ్య, బూడిద మధు, కె.రవి, బానోతు హుస్సేన్ పాల్గొన్నారు.
తిరుమలగిరి :మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నెల్లుట్ల రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.ముఖ్యఅతిథి తెలుగు భాష సీనియర్ అధ్యాపకులు గాదరబోయిన లింగయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ మరణం ప్రపంచానికి తీరని లోటు అని, ఆయన యుగయుగాలుగా తరతరాలుగా మనిషి మనిషిని దూరం చేసిన మనువాదాన్ని సమూలంగా నాశనం చేసి నవభారత రాజ్యాంగాన్ని రూపొందించిన అభినవ మనువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉపేందర్, వీరన్న, శంకర్, దేవేందర్, కరుణ, గీత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలకేంద్రంతో పాటు మండలంలోని తాటిపాముల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పెరుమాళ్ల పురుషోత్తం పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యూత్ నాయకులు దయాయాదవ్, గ్రామ సర్పంచ్ ఎర్ర శోభ శ్రీనివాస్, ఎంపీటీసీ కోర్ణ ప్రవీణ్, మాజీ సర్పంచ్ కారుపోతుల అంజయ్య, మాజీ ఎంపీటీసీ చిటురి లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ యమగాని ఐలయ్య, భూపతి కొమురయ్య,చెరుకు సోమయ్య,పొట్టి ఎల్లయ్య ఐలా ఉపేందర్ గౌడ్ ఆకుల వెంకటేశ్వర్లు,కాకర్ల రమేష్, భాషాపాక స్వామి,బందెల జేమ్స్,ఎర్ర గణేష్ ,సుధాకర్ కొల మల్లేష్, సాగర్, కన్నాఅంజి, ఎర్ర పరుశరాములు పాల్గొన్నారు.
పట్టణంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్,ఎంపీపీ నెమరుగోమ్ముల స్నేహలత, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తిరుమలగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కందుకూరు లక్ష్మయ్య పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్, సామాజిక తెలంగాణ మహాసభ, జంబుద్వీప జనసమితి ఆధ్వర్యంలో తిరుమలగిరి క్రాస్‌రోడ్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టుమల్లయ్య,మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న, మాదిగ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల సోమయ్య, జంబుద్వీప జన సమితి రాష్ట్ర కన్వీనర్ ఫత్తేపురం యాదగిరి, గొల్ల, కురుమహక్కుల నవనిర్మాణసమితి రాష్ట్ర కన్వీనర్ బుక్కరాజు తిరుపతి, మాదిగ ఎంఎస్పీ ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు కందుకూరి శ్రీను, ఎల్‌హెచ్‌పీఎస్ తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ భూక్యాశ్రీనునాయక్, ఎంసీపీఐ మండల కన్వీనర్ నలుగురి రమేష్,ఆర్.యాదన్న, సంకపాక ప్రభాకర్, నాగార్జున, గద్దలఅనుదీప్, కంచనపల్లిరవి, కండెల బాబురావు, గిలకత్తులహనుమంతు, కందుకూరి వెంకన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నర్సయ్యయాదవ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, ఎంపీఓ సందీప్‌కుమార్, ఏపీఓ రవీందర్, వీసీ నగేష్, సుధీర్ ,కార్యదర్శులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని పర్సాయపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జైభీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాచకొండ గీత సురేష్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ఎర్రనర్సయ్య,టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కొప్పులభరత్రెడ్డి,బీసీసెల్ మండల అధ్యక్షులు మిర్యాల వెంకన్న, జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు,టీఆర్ఎస్ మండల నాయకులు యుగంధర్, ఉపాధ్యక్షులు కేసారపు వెంకన్న, పోలేపాక అర్జున్, సుధాకర్, కొప్పుల సీతారాంరెడ్డి, కుంభం భిక్షం గౌడ్,కీర్తి, చిట్టిబాబు, గోపి, ఉపేందర్ పాల్గొన్నారు.
పాలకవీడు: మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ గోపాల్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటాచారి, కార్యాలయ సిబ్బంది పిచ్చయ్య, నర్సింహ, కల్పన, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరుఎస్ :మండలంలోని నెమ్మికల్కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సవిత అంబేద్కర్ నూతన యువజన సంఘం కమిటీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంపల సతీష్,వార్డు సభ్యులు గోలి కర్నాకర్, కాలనీపెద్దలు పురం జాన్,పురంసైదులు, గంపల కృపాకర్, రహీంపాషాపాల్గొన్నారు.
సవిత అంబేద్కర్ నూతన కమిటీ ఇదే..అధ్యక్షులుగా గంపల మహేష్,ఉపాధ్యక్షులుగా గంపల హృదరు,ప్రధాన కార్యదర్శిగా గంపల నరేందర్,కోశాధికారిగాపురం భార్గవ,నగెల్లి దయాకర్,క్రీడా కార్యదర్శిగా గాజుల సురేష్,పురం హరికృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా గాదరి పవన్,గాజుల పవన్ ఎన్నికయ్యారు. అనంతరం మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండలఅధ్యక్షులు మేడికృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు.
నూతనకల్: మండలకేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, సీఐటీయూ మండలనాయకుడు బొజ్జ శ్రీను,పోలేపాక నగేష్ పాల్గొన్నారు.
చింతలపాలెం: మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎస్సై కృష్ణారెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో చింతలపాలెం ఎంపీటీసీ మహాత్యం, టీఆర్ఎస్ మండలనాయకులు షేక్అమీర్సాబ్, వెంకటరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎం.కోటయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బాలచంద్రుడు, సైదులు, వీహెచ్పీఎస్ నాయకులు నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రవి, ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ కార్యదర్శి ప్రేమయ్యా, ఓజో ఫౌండేషన్ సభ్యులు ఏసు, సురేందర్, బుకర్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీను, నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల: మండలంలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జనసమితి మండల అధ్యక్షుడు సుమాన్నాయక్ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో చరణ్, మల్సూర్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.