Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రిభువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
విద్యార్థులు నాలెడ్జితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాతలు, కాలేజీ అధ్యాపక సిబ్బంది ఏర్పాటు చేసిన పోటీ పరీక్షలకు, కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన పుస్తక లైబ్రరీని జిల్లా ప్రారంభించారు. విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్ బృందాలు సమర్పించిన వందన స్వీకారాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాలెడ్జ్ పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, డిగ్రీతో పాటుగా ఏవిధంగా నడవాలి, ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే అవగాహన కలిగి ఉండాలని, ఇంగ్లీషు భాషపై పట్టు పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మికాంత్, ఎన్.సి.సి. ఆఫీసర్ విక్రమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా స్థాయి ఆధార్ కార్డు కమిటీపై సమావేశం...
జిల్లా స్థాయి ఆధార్ కార్డు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా జన్మించిన వారికి ఆధార్ నమోదు చేయడం, పది సంవత్సరాలకొకసారి ఆధార్ నవీకరణ, మొబైల్ ఆప్డేషన్ ఆధార్ నమోదు కేంద్రాలను పెంచడం ఆధార మోసపూరిత కార్యక్రమాలను కనిపెట్టడంపై సమీక్ష నిర్వహించి, అధికారులతో చర్చించారు. ఆధార్ నమోదుకు కృషి చేయాలని ఆధార్ నవినీకరణకు ప్రచారం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు డి. శ్రీనివాసరెడ్డి కన్వీనరుగా, మెంబర్లుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నారాయణరెడ్డి, డిస్ట్రిక్ట్ మేనేజరు ఎన్.సాయి కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్, ఆధార్ హెడ్ ఆఫీసు ప్రతినిధి వినరు పాల్గొన్నారు.