Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగునర్సింహ డిమాండ్ చేశారు. భువనగిరి మండల కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవన్లో కొండమడుగు నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఇవ్వాలని, ప్రతి గ్రామంలోనూ గ్రామ సభ పెట్టి దళిత బంధు లబ్ధిదారులను గుర్తించాలని అన్నారు, నూతన పెన్షన్ కొరకు అప్లికేషన్స్ ప్రతినెల తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి దయ్యాల నరసింహ , కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరు మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు సిల్వేరు ఎల్లయ్య,పాండాల మైసయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి పాల్గొన్నారు.