Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.59 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు
- పనులకు 15 లోగా టెండర్లు
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -రాజాపేట
ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని, నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవలే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్ట్లకు ప్రభుత్వానికి రూ.59 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. బేగంపేట వాగులో ఓవర్ బ్రిడ్జికి 9.60 కోట్లు, పారుపల్లి వాగులో బ్రిడ్జికి రూ.12 కోట్లా 60 లక్షలు, కాల్వపల్లి వాగుకు రూ.3కోట్లా16 లక్షలు ,రాజపేట ఊరిలో బాక్స్ కల్వర్టుకు 84 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తికానునట్టు చెప్పారు నమిలే అవాస గ్రామమైన పిట్టల గూడానికి రెండు కిలోమీటర్ల మేరకు మదర్ డైరీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి ద్వారా స్వచ్ఛందంగా రోడ్డు వేయించామని గుర్తు చేశారు. మరో కొంత మేరకు రోడ్డును పట్టే దారులను ఒప్పించి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్న అభివృద్ధిలో తగ్గేదే లేదని సవాల్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ బిజెపి వైఎస్ఆర్సిపి పార్టీలు చేతకాని దద్దమ్మ మాటలు మాట్లాడడం మానుకోవాలని పలికారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీలో బాస్ ఉంటాడని తెలంగాణ బాస్ కేసీఆర్ అని కొనియాడారు .బిజెపి నాయకులు దమ్ముంటే మీరు అధికారం చేపట్టే రాష్ట్రాలలో తెలంగాణ పథకాలను అమలు చేసి సత్తా నిరూపించుకోవాలన్నారు. ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే ఆలేరులో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోపాల్ గౌడ్, విజిలెన్స్ కమిటీ మెంబర్ సందుల భాస్కర్ గౌడ్, మదర్ డైరీ డైరెక్టర్ ఆర్కాల గాల్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.