Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చూపిన బాటలో నేటి యువత పయనించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 66వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో కులమతాలకతీతంగా ప్రతి పౌరుడు స్వేచ్చగా బతకడానికి రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు ఎర్ర ఊషయ్య, చీకూరి ఈదయ్య, గుణమోని అయిలయ్య, కందాల బిక్షం, శేఖర్, రొడ్డ భగత్, బాతరాజు నర్సింహా పాల్గొన్నారు.