Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
నేరాలను అదుపు చేయడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమైందని బాధ్యతాయుతంగా పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను డీసీపీి నారాయణరెడ్డి, చౌటుప్పల్ ఏసిపి ఉదరు రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి మొక్కలు నాటారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని నేరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలు అన్నిటిని సక్రమంగా సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతిభద్రతలు మెరుగవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ మోతీరాం, ఎస్సై లక్ష్మయ్య, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.