Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బులు బీరు మల్లయ్య, సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చెందేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్‌్ నోముల పరమేశ్వర్ రెడ్డి, నందనం ఎంపిటిసి మట్ట పారిజాత శంకర్ బాబు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, చందుపట్ల బ్యాంకు సింగిల్ విండో మాజీ చైర్మెన్‌్ బలుగూరి మధుసూదన్ రెడ్డి, ఉపసర్పంచ్ పబ్బతి రాములు పాల్గొన్నారు.
పూర్ణగిరి ఆలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు...
శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ, నరసింహస్వామి ఉపాసకులు బత్తిని రాములు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మెన్ లక్ష్మీనారాయణ గౌడ్, పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యేను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయం వద్దసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
వలిగొండ : మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ ఆవాస గ్రామమైన మల్లెపల్లి గ్రామాలలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో బాంబులతో కోలాటాలతో ఎమ్మెల్యేను ఆహ్వానించారు. సి డి ఎఫ్ నిధులు కోటి ఎస్ డి ఎఫ్ నిధులు 25 లక్షలతో సీసీి రోడ్లు శంకుస్థాపన చేశారు .మహాత్మా గాంధీ నిధులతో 30 లక్షలతో రోడ్లు ప్రారంభించారు నూతనంగా నిర్మించిన రైతు వేదిక ప్రారంభించారు. మొదటిసారిగా ఎమ్మెల్యే వలిగొండలో 20 కేంద్రాలలో మల్లెపల్లి లో రెండు చోట్ల కాలినడకన ప్రతి అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి తిరిగారు. స్థానికంగా సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత ఎంపీటీసీలు పాల్చం రమేష్ కుందారపు యశోద పల్లెర్ల భాగ్యమ్మ ఉప సర్పంచ్ మై సోల్ల మత్స్యగిరి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు ఎమ్మే లింగస్వామి మండల కార్యదర్శి ఐ టి పాముల రవీంద్ర మాజీ ఎంపీటీసీ ఐటి పాముల జ్యోతి సత్యనారాయణ నాయకులు సతీష్ రమేష్ టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.