Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరి గుట్ట
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న వికలాంగుల పెన్షన్లను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 17న వెంటనే రద్దు చేయాలని అర్హులైన వికలాంగుల అందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ఇటీవల రద్దు కాబడిన మొత్తం పెన్షన్లను సమగ్ర విచారణ జరిపి పునరుద్ధరించాలని బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మూడో అఖిలభారత మహాసభల సందర్భంగా యాదగిరి గుట్ట పట్టణంలో మహాసభల వాల్ పోస్టర్ ను పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఈనెల 26, 27, 28 తేదీలలో నిర్వహించ తలపెట్టిన అఖిలభారత మూడో మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల పరిషత్ అధ్యక్షులు చీర శ్రీశైలం, జెడ్పీటీసీి అనురాధ, నాయకులు కవిడే మహేందర్ జి సిద్దిరాజు పర్వతాలు. సంఘం జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ,కోశాధికారి బొల్లెపల్లి స్వామి ,మహిళా కన్వీనర్ కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.