Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యతాప్రమాణాలు తప్పక పాటించాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.జిల్లా పరిధిలోని ఐదు పురపాలికలలో పట్టణ అభివద్ధి కార్యక్రమాలను సమగ్రంగా, పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.సమగ్ర నాన్‌వెజ్ మార్కెట్, వైకుంఠధామాలు, 100 శాతం మంచినీటి సరఫరా, బిల్డింగ్ పర్మిషన్ల అమలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, బయోమైనింగ్ప్రాసెస్, హరితహారం, మోడ్రన్దోభీఘాట్ నిర్మాణం, మొదలగు కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.పట్టణాలలోని అంగన్వాడీ సెంటర్లను సుందరీకరణ చేయాలని తెలిపారు.మున్సిపాలిటీల వారీగా కమిషనర్లను జరుగుతున్న పనుల యొక్క వివిధ దశలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.