Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండన్ సుదర్శన్
నవతెలంగాణ-సూర్యాపేట
ఏఎన్ఎంల పెండింగ్ సమస్యలను ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండన్ సుదర్శన్ డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక సాయి బృందావన్ హోటల్లో నిర్వహించిన ఎంపీహెచ్ఏ మహిళా రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.50 ఏండ్లుగా అనేక రకాల వ్యాధులపై వైద్యఆరోగ్య సిబ్బంది యుద్ధాలు చేసి అలసిపోయారని, ఇప్పటికైనా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించా లన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ఏండ్లుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రమోషన్లు లేవని ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.అలాగే వచ్చే వేతనంలో అడిషనల్ అలవెన్స్‌లకు సంబంధించి హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతిస్తున్నారన్నారు.మహిళల కష్టాలు చూసిన అడిషనల్ హెచ్ఆర్ఏ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.ప్రతినిత్యం ఏఎన్‌ఎంలలో భయం, పనిఒత్తిడి పెరుగు తుందన్నారు.సీఎంకేసీఆర్ ప్రవేశపెట్టే ప్రతి ఆరోగ్య కార్యక్రమాల్లో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తున్నారన్నారు.సర్వీస్ నిబంధనలు, చిన్నచిన్న సాకులు చెబుతూ ఉన్నతాధికారులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏఎన్ఎంల సమస్యలను పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్నతాదికారులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అధికారులు ఏఎన్ఎ ంలను ఆశా వర్కర్లను దుర్భాషలాడడం మాను కోవా లన్నారు.మహిళా సిబ్బంది మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా రాబోయేరోజుల్లో సహించేది లేదన్నారు.ఏఎన్ఎంల పదోన్నతుల విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన హెల్త్ డైరెక్టర్‌తో మాట్లాడి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమక్షంలో జనవరి చివరి వరకు ప్రమోషన్లు ఇచ్చేలా హామీ తీసు కున్నామన్నారు.మహిళా సిబ్బంది అయినా ఎంపీహెచ్ఏ ఫిమేల్ నాకు రావాల్సిన అన్ని రకాల అలవెన్స్ లను వెంటనే చెల్లించాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ను ఈ యూనియన్ సమావేశ తీర్మానం ద్వారా తెలియ జేశామన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు, రాష్ట్ర నాయకురాలు కుంట్ల సుకన్య, సీనియర్ సిస్టర్లు మేరమ్మ, రమణ, కోదాడ, సూర్యాపేట ఏఎన్ఎం నాయకురాలు ఉమామహేశ్వరి, భిక్షమమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.