Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ...
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదర్శ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ గ్రామంలోనికి ప్రధాన రహదారి వెడల్పు కోసం ఆరు నెలలుగా రోడ్డు పై ఉన్న బీటీ రోడ్డును తొలగించి, తొలగించి, పట్టించుకోకుండా వదిలేశారు. భువనగిరి ఎమ్మెల్యే రోడ్డు వెడల్పు చేసే సందర్భంలో టీిఆర్ఎస్ సర్పంచులుగా ఉన్న గ్రామాలలో ఆ గ్రామం వరకు డబుల్ రోడ్డు వేయడానికి సహకరించారని, అందులో భాగంగానే గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యేలు అడగక డబుల్ రోడ్డు ఒప్పుకున్నట్టు తెలిపారు.కానీ ఎంపీ దత్తత గ్రామం, ఆదర్శ గ్రామం కావడంతో మళ్ళీ పట్టీ పట్టనట్టు ఎమ్మెల్యే వ్యవహరించడంతో రోడ్డు సమస్య కోలికి రావడం లేదని సర్పంచ్ ఆరోపిస్తున్నారు.ఏదిఏమైనా రోడ్డు సమస్యతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు రోడ్డు సమస్య తయారైందని గ్రామస్తులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.వివరాలను పరిశీలిస్తే సింగిల్ మార్గం ఉన్న రోజులు డబుల్ రోడ్డు గ్రామం వరకు వేస్తామని గ్రామంలో రోడ్డును వెడల్పు చేశారు.స్థానిక ఎమ్మెల్యే సహకరించడం లేదని గ్రామ సర్పంచ్ ఆరోపిస్తుండగా, ఎంపీ దత్తత తీసుకున్న గ్రామం అన ఎమ్మెల్యే వర్గం వారు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా కంపా వేసి నిరసన వ్యక్తం చేస్తూ, రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న భువనగిరి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపను తీసివేసి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేరుకు ఆదర్శ గ్రామాన్ని చెబుతున్నప్పటికీ, గ్రామ ప్రధాన రహదారి దుమ్ము, దులితో గుంతల మయం కావడంతో, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నించారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.