Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు యాదయ్య
నవతెలంగాణ-రామన్నపేట
చిరుద్యోగులకు, డ్రాప్ ఔట్స్కు, నిరుపేదలకు విద్యనందించి ఉన్నతోద్యోగులుగా, వృత్తినిపుణులుగా తీర్చిదిద్దిన పెన్నిధి ఓపెన్ యూనివర్సిటీ అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా. బెల్లి యాదయ్య అన్నారు.బతుకుభారంలో వివిధ పనులు చేసుకుంటూ అర్ధాంతరంగా చదువు మానేసిన వయోజనులు ప్రతిఒక్కరూ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ద్వాకా పూర్తిచేసి ఉన్నత విద్యావంతులుగా సామాజంలో గుర్తింపు పొందేందుకు డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ అవకాశం కల్పిస్తుందన్నారు.బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 40 వసంతాల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతంలోని వయోజనులందరూ కళాశాలలో నడిచే అధ్యయన కేంద్రంలో ప్రవేశం తీసుకొని విద్యాసేవలను వినియోగించుకొని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఓపెన్ యూనివర్సిటీ నాలుగ దశాబ్దాల సేవలను కొనియాడారు.అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డి.మక్లా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రీ, అధ్యాపకులు శ్రీకాంత్, ఇందిర, రమాదేవి, స్టడీ సెంటర్ సిబ్బంది ఆంజనేయులు, మమత, శంకరయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.