Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం
- అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 9 వ రోజుకు చేరుకున్నాయి.కాగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ భూపాల్‌రెడ్డితో కలిసి భూ నిర్వాసితులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌తో చర్చించి అన్ని సమస్యలకు పరిష్కరిస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని దీక్షలు విరమించాలని సూచించారు.అనంతరం గ్రామ ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులుయాదవ్, సర్పంచ్ పిన్నం లతారాజు, ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్‌రెడ్డి, గ్రామ నిర్వాసితులు గ్రామ ప్రజలు మాకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతనే దీక్షలు విరమిస్తామని, అంతవరకు ఇక్కడే దీక్షలు కొనసాగిస్తామని తేల్చి చెప్పడంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మెన్ ఉడుత మహేందర్, పిన్నం పాండు, మెడబోయిన రాములు, నకిరేకంటి అశోక్, డొంకెన సత్తయ్య, బాలయ్య, నరసింహ, హరిబాబు, నరేష్, గ్రామస్తులు, నిర్వాసితులు పాల్గొన్నారు.