Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆపద సమయంలో పేద ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటానని సూదగాని ఫౌండేషన్చైర్మెన్, బీజేపీ జిల్లా నాయకులు సూదగాని హరిశంకర్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.బీజేపీ మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు మల్లేపాక పద్మ సోదరుడు అంబాల రాజు మరణించడంతో మతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం పెద్దపడిశాల గ్రామంలో ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించిన రావుల మల్లేష్,తుర్కలశాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి గాయాలపాలైన పొన్నగాని శ్రీకాంత్ గౌడ్ కుటుంబాలను పరామర్శించి మూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మరాటి బీరప్ప,స్థానిక సర్పంచ్ రావుల మల్లేష్ యాదవ్,అలేరు నియోజకవర్గ బీజేవైఎం కో కన్వీనర్ పింగళి విజరు రెడ్డి,రణమల్ల మధుకర్ రెడ్డి,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చేడే నాగన్న,ఓబీసీ అధ్యక్షులు కోడెల రవి,నోముల రాములు,నర్రాముల బాలకష్ణ, క్రిష్ణ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.