Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
బ్యాంకులు సకాలంలో రుణాలందించి ప్రభుత్వలక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లకు సూచించారు.బుధవారం కలెక్టరేట్ మీటింగ్‌హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సెప్టెంబరు వరకు రూ.631 కోట్లు వ్యవసాయ పంట రుణాలుగా అందజేశామన్నారు.దీనిలోని వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలుగా రూ.297 కోట్లతో మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.928 కోట్లు బ్యాంకుల ద్వారా అందజేశామన్నారు.వ్యవసాయరుణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంటరుణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.సూక్ష్మరుణాల కింద సూక్ష్మచిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు గాను రూ.167 కోట్లు ఇచ్చామన్నారు.విద్యారుణాలుగా రూ.8కోట్లు, గృహ రుణాలుగా రూ.19 కోట్లు అందించామన్నారు. అంతే కాకుండా ప్రాధాన్యతారంగాలకు రూ.13 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు.జిల్లాలో 11903 మహిళాసంఘాలకు రూ.518 కోట్ల రుణాలులక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.దీనిలో ఇప్పటివరకు 5814 సంఘాలకు గాను రూ.334 కోట్లు అందించి 57 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు.అర్హత ఉన్న సంఘాలకు రుణాలకు వెంటనే అందించాలని, రెన్యువల్ లోప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు.మెప్మా కింద 680 సంఘాలకుగాను 315 సంఘాలకు రూ.42.50 కోట్లకు గాను రూ.23.06 కోట్ల రుణాలు అందజేశామన్నారు. వీధివ్యాపారులకు అందించే రూ.20 వేల రుణానికి సంబంధించి జిల్లాలో 4242 వీధి వ్యాపారులకు 8కోట్లా 48 లక్షలా 040వేల రూపాయలకుగాను 2078 మంది వ్యాపారులకు 4 కోట్లా 15 లక్షలా 60 వేల రూపాయలు అందించి 54 శాతం లక్ష్యం సాధించామన్నారు. ఈనెల 20 లోగా 5 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యాదీవెన పథకం కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఎలాంటి జాప్యం లేకుండా ఓపెన్ చేయాలన్నారు.తద్వారా జిల్లాలో 1800 మంది విద్యార్థులు లబ్దిపొందుతారని తెలిపారు. వీధి వ్యాపారులకు మొదటి విడుత పది వేలు సకాలంలో చెల్లించిన వారికి రెండవ విడుతగా 20 వేలు సత్వరమే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు.నాబార్డు ద్వారా రాబోయే 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణప్రణాళికను కలెక్టరు విడుదల చేశారు.జిల్లాలో రూ.3508 కోట్లు రుణలక్ష్యంగా నాబార్డు నిర్ణయించిందన్నారు.దీనిలో వ్యవసాయరంగానికి రూ.2976 కోట్లు, సూక్ష్య రుణప్రణాళికకు రూ.353 కోట్లు, విద్యారంగానికి రూ.25 కోట్లు, గహ నిర్మాణానికి రూ.116 కోట్లు, ఇతర మౌలికవసతులకు రూ.21 కోట్లు, సోలార్ ఎనర్జీ సంబంధించి రూ.15 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి కె.శ్రీరామకృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి శివరామన్, నాబార్డు డీడీఎం వినరుకుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రమేశ్, జిల్లా మత్స్య అధికారి రాజారామ్ పాల్గొన్నారు.