Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
- విద్యార్థులను భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్‌ఫేర్ చక్కని వేదిక అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని రాయగిరి గ్రామంలో గల విద్యాజ్యోతి హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్డ్ అవార్డు ప్రదర్శనను ఆమె జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలనగావించి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ పాటవాలు ఉన్న పిల్లలను టీహబ్ ప్రోత్సహిస్తుందన్నారు.వ్యవసాయ రంగంలో విప్లమాత్మక మార్పులకు శాస్త్రీయపద్ధతే ప్రధానకారణమన్నారు.విద్యార్థులు నిరుత్సాహ పడకుండా ధైర్యంగా తమ తమరంగాలలో ముందుకుపోవాలన్నారు.జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలికే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి విద్యార్థులు ఏదో ఒక ప్రతిభ ప్రత్యేకత ఉంటుందని వారిని ఆసక్తిని బట్టి తమకు వచ్చిన రంగాలలో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ... సైన్స్ జీవితానికి విడదీయడానికి బంధం ఉందని, సైన్స్ వేరు నమ్మకం వేరని, జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రపంచం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి సైన్స్ కారణమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికితీసి భవిష్యత్ శాస్త్రజ్ఞులను తయారు చేయాలని పిలుపునిచ్చారు.శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయతను నేర్పించాలన్నారు.సభాధ్యక్షులు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సైన్స్ నూతన ఆవిష్కరణలు కారణమన్నారు. సైన్స్‌లేని జీవితాన్ని ఊహించుకోలేమన్నారు.సైన్స్‌ఫేర్ ప్రదర్శనలు 233, ఇన్స్పైర్ ప్రదర్శనలు 25 వచ్చాయని తెలిపారు. సైన్స్ వేర్ కార్యక్రమంలో కలెక్టర్ చైర్మెన్‌గా,జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి రిబ్బన్‌కట్ చేసే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్, జెడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య, మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు పాల్గొనగా మొదటి రోజు జిల్లా పరిధిలోని 15 పాఠశాలలు చెందిన 2000 మంది విద్యార్థులు ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకించి సాయంత్రం నిర్వహించ సంస్కృతి కార్యక్రమంలో పాల్గొన్నారు.