Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులకు రక్షణ లేదని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీచట్టం కింద పని చేసిన పని వివరాలకు సంబంధించిన రికార్డులు ఎక్కడ పడితే అక్కడ కింద పడి ఉన్నాయి.వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు రికార్డులను చూసి ఆశ్చర్యపోతున్నారు.ప్రభుత్వ కార్యాలయంలో రికార్డులకు రక్షణ లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు 57 ఏండ్లు నిండిన పెన్షన్ దారుల దరఖాస్తు ఫారాలు సైతం కింద పడి ఉన్నాయి. ఇచ్చిన దరఖాస్తులను భద్రపరచకుండా జిరాక్స్‌లను ప్రతిసారి తెప్పిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.