Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-భువనగిరి
బీజేపీ కార్మిక,మతోన్మాద వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు 3వ మహాసభ బుధవారం స్థానిక ఏఆర్గార్డెన్లో నిర్వహించారు.మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ కార్మికులకు నష్టం చేసే విధానాలను తీసుకొచ్చిందన్నారు.8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయడం కోసం లేబర్ కోడ్ లను తిసుకువచ్చిందని విమర్శించారు.కార్మికుల కనీస నెల వేతనం 4500 రూపాయలలోపు ఉంటే సరిపోతుందని మోడీ ప్రభుత్వం చెప్తుందని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండాలని డిమాండ్ చేశారు.నూతన జాతీయ విద్యావిధానం పేరుతో,పండుగల పేరుతో మతోన్మాదం ప్రవేశపెడుతుందని విమర్శించారు.సంపద సృష్టికర్తలైన కార్మికులను విస్మరించి యాజమాన్యాలే సర్వస్వమనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు.మహాసభ ప్రారంభానికి ముందు జెండాను సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు దోనూరి నర్సిరెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యవక్తలుగా రాష్ట్ర కార్యదర్శి భూపాల్,రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్ ప్రసంగించారు.ఈ మహాసభకు అధ్యక్షవర్గంగా కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఎండి.పాషా, రమాకుమారి వ్యవహరించగా జిల్లా కార్యదర్శి దాసరి పాండు,జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, జిల్లా ఆఫిస్ బేరర్స్ మామిడి వెంకట్ రెడ్డి, తుర్కపల్లి సురేందర్, కూరెళ్ళ రాములు నాయకులు ఫైళ్ళ గణపతి రెడ్డి, బూర్గు స్వప్న,సోములు, గోరుగంటి వెంకటేశం, గడ్డం ఈశ్వర్ ,మాయ కృష్ణ, మాతయ్య పాల్గొన్నారు.