Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.బుధవారం మండలకేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయాన్ని వారు సందర్శించారు.టీఆర్ఎస్ నాయకులు వారికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి పూర్తిగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి,చిరుమర్తి లింగయ్య,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కటికం సత్తయ్యగౌడ్,రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ కుంట సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు మెరిశెట్టి ఉపేందర్,చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ్ బైరబోయిన సునీత రామలింగయ్య పాల్గొన్నారు.