Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రస్థాయిలో సూర్యాపేట జిల్లా సత్తాను చాటాలి
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
- పేటలో ముగిసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని దానికి పదును పెట్టి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు.జిల్లాకేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.నేటి సమాజంలో తమపిల్లల్లో తల్లిదండ్రులు చూడలేని ప్రతిభను ఉపాధ్యాయులు చూసి వారిలోనే నైపుణ్యాన్ని పెంపొందించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారన్నారు. ఈ ప్రదర్శనలో బహుమతులు పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో జిల్లా సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాపరంగా ముందుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 518 ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులను, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీలను ఆమె అభినం దించారు.అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.అలాగే మూడు రోజులుగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు దాతలుగా వ్యవహరించిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీలామహదేవ్, జయవేణుగోపాల్, బెల్లంకొండ రామ్మూర్తి, గొప్పగానిగిరి, ముప్పారపు నరేందర్‌లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌అధికారి దేవరాజ్,జెడ్పీ సీఈఓ సురేష్, డీఈఓ అశోక్,ఏడీ శైలజ, సైన్స్ ఎగ్జిబిషన్ కన్వీనర్ శత్రునాయక్, కో కన్వీనర్లు ఎన్.రవి, గోపాల్‌రావు, సలీం, షరీఫ్, పలు ఉపా ధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.