Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలం తొండ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని బుధవారం సర్పంచ్ శాతవాహన్రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్య బృందం గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 200 మంది ప్రజలు వైద్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించారు.అదేవిధంగా ఆరోగ్య సర్వేలో ప్రజల వివిధ ఆరోగ్య వివరాలు సేకరించినట్టు తెలిపారు.అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహనా సదస్సు ఈసారి ప్రత్యేకంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు మానసిక ,శారీరక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు.యోగాట్రైనింగ్ కూడా ఇచ్చారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిపారు. పౌష్టికా హారం, వాటివల్ల కలిగే లాభాలను పిల్లలకి తెలియ జేశారు.వర్షాకాలం సంభవించే వివిధ ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసి, ఆ వ్యాధులు సోకకుండా తీసుకునే జాగ్రత్తలు వివరించారు.అదేవిధంగా పాఠశాలల విద్యార్థి నులకు రుతు సంబంధిత వ్యాధుల గురించి తెలియచేసి, జాగ్రత్తలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, రెతు సమన్వయ సమితిమండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ప్రోగ్రాంఆఫీసర్ వినోద్‌కుమార్, క్యాంపు అధికారి శ్రీనివాస్, ప్రీతం భావన, డా.హిమభువన, ఇతర జూనియర్ డాక్టర్స్, ఆశా,అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.