Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుడు ప్రభావతి
నవతెలంగాణ- చిట్యాలటౌన్
రోజురోజుకు సమాజంలో మహిళలపై పెరుగుతున్న హింసను ప్రభుత్వం అరికట్టాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. చిట్యాలలోని సరస్వతి జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన మహిళా సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై దాడులు, దౌర్జన్యాలు హత్యలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారన్నారున. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ మహిళలు వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. ప్రధానంగా డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరకడం వలన మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని చెప్పారు. హింస లేని సమాజం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో మహిళా సంఘం నాయకురాలు కందుల అనిత, లోడే ప్రసన్నలక్ష్మి, పుల్లెంల సంతు, నల్ల ప్రియాంక, ఏ .రామ సౌమ్య, కవిత కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.